బ్రేకింగ్‌: అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులు బంద్‌

banks india sep

ఒక నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంకు లావాదేవీలు జరిపేవారికి ఇది షాకింగ్‌ న్యూసే. అక్టోబర్‌లో బ్యాంకు పనిదినాలపై ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 2న మహాత్మగాంధీ జయంతి, అనంతరం విజయదశమి సందర్భంగా 12 నుంచి 16వ తేదీ వరకు సెలవు. ఆ నెలలో 5 ఆదివారాలు, 2వ శనివారం, 4వ శనివారం సాధారణ బ్యాంకు సెలవులు. కాగా వీటితో పాటు 1,6,7,18,19,20,22,26 తేదీల్లో బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ప్రకటించింది. మొత్తంగా అక్టోబర్‌ నెలలో 21 రోజులు బ్యాంకులు పనిచేయవ్‌. మిగిలిన రోజుల్లో ప్రజలు తమ లావాదేవీలు జరుపుకోవాలని ఆర్బీఐ సూచించింది.