నెల్లూరు పెద్ద హాస్పిటల్ లో దారుణం! వైద్య విద్యార్థిని రూమ్ కి రమ్మన్న ఉపాధ్యాయుడు!

గురువు అంటే కేవలం మూడు విడి అక్షరాలు మాత్రమే కాదు. ఒక జీవితం మొత్తానికి సరిపడే జ్ఞానాన్ని నేర్పి.., జీవితాలని సరిదిద్దే మహర్షి. ఇందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వరః అంటారు. గురువుకి అంతటి పవిత్ర స్థానాన్ని ఇచ్చాయి మన వేదాలు. కానీ.., కొంతమంది గురువులు మాత్రం కీచకులుగా మారుతున్నారు. తండ్రి స్థానంలో ఉండి కంటికి రెప్పగా కాయాల్సిన వారే చదువుకుంటోన్న అమ్మాయిలను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా నెల్లూరు జీజీహెచ్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అతను నెల్లూరు జీజీహెచ్లో డాక్టర్ గా, వైద్య విద్యార్ధులకి గురువుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక రకంగా దేశానికి డాక్టర్స్ ని తయారు చేయించి ఇచ్చే పవిత్ర వృత్తి. అంతటి గొప్ప స్థానంలో ఉండి కూడా అతని బుద్ధి గడ్డి తింది. కామంతో కళ్ళు మూసుకుని పోయి.., వైద్య విద్యార్థినిపై కన్నేశాడు ఆ ప్రబుద్ధుడు. తాజాగా గురువారం ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ ఆడియోలో కామందుడి బాధను బరించలేని విద్యార్థిని తన ఆవేదను ఇలా చెప్పుకొచ్చింది.

hospital2 1 ‘నా వయస్సు 23 ఏళ్లు.. నాకు తెలిసి మీ పిల్లలకూ ఇదే వయస్సు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా… ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నువ్వు నా సోల్మేట్.. లైఫ్ పార్ట్నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏమిటి సార్? రెస్టారెంట్లు, బీచ్కు రావాలని అడుగుతారా? నీ రూమ్లో ఏసీ లేదుగా.. నా రూముకు రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్.. నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నంబరును బ్లాక్ చేస్తే.. మరో నంబరు నుంచి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానసికంగా వేధించడం వల్ల కొన్ని నెలలుగా పుస్తకాలు తెరవలేదు. విధులు నిర్వహించినా.. సంతకం పెట్టలేదు.. సార్’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందా యువతి. దీంతో.., ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా ఈ వ్యవహారం చివరికి జిల్లా అధికారుల వద్దకి చేరింది. ఈ విషయాన్నిసీరియస్గా పరిగణలోకి తీసుకున్న జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే నెల్లూరు జీజీహెచ్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ చాలా మంది డాక్టర్స్ అక్కడి స్టాఫ్ నర్స్ లను ఇలానే వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక రెండేళ్ల కిందట ఓ వైద్య విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగుచూడటంతో ఆమె కుటుంబసభ్యులు ఆయనపై దాడి చేశారు. దీంతో అధ్యాపకుడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించి.. విచారణ కమిటీ వేసింది. అప్పట్లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ మరచిపోకముందే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇలాంటి ఘటన జరగడంతో అందరూ షాక్ కి గురి అవుతున్నారు. అసలు నెల్లూరు జీజీహెచ్లో లో అమ్మాయిలకి భద్రత ఉందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. మరి.., విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరిస్తున్న కీచక గురువులకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.