రైడ్ షేరింగ్ ప్లాట్ ఫారమ్ లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తాజాగా.. ఉబెర్, ఓలా,ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాను సైతం విధిస్తామని రవాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఓ యంత్రంలా తయ్యారు అయ్యాడు. పని ఒత్తిడి కారణంగా ఓ చోట నుంచి మరో చోటకు వెంట వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ.. లేని వారికే అసలు ఇబ్బందులు. అలాంటి వారికి ఉబెర్, ఓలా, ర్యాపిడో లాంటి సంస్థలు మేమున్నాం అంటూ భరోసాని ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం తాజాగా.. ఉబెర్, ఓలా,ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాను సైతం విధిస్తామని రవాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రైడ్ షేరింగ్ ప్లాట్ ఫారమ్ లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రవాణాయేతర (ప్రైవేట్) రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన ద్విచక్ర వాహనాలు ప్రయాణీకులను తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని, ఇది పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలు, మోటారు వాహన చట్టం, 1988ని ఉల్లంఘించినట్లే అని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో తెలిపింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సేవలపై నిషేధం విధిస్తుందని ఢిల్లి ప్రభుత్వం తెలిపింది. దీనిని ఉల్లంఘిస్తే.. మెుదటి సారి రూ. 5వేలు జరిమానా విధిస్తామని, రెండో సారి రూ. 10 వేలు జరిమానా విధిస్తామని రవాణ శాఖ తెలిపింది.
అదీకాక పట్టుబడ్డ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. ఈ రైడ్ లను సులభతరం చేసే డిజిటల్ యాప్ లపై కూడా మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం రూ. లక్షరూపాయలు జరిమానా విధిస్తామని నోటీసులో తెలిపింది. మరి ఓలా, ఉబెర్, ర్యాపిడోలపై ఢిల్లి ప్రభుత్వం నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.