నా జుట్టుతో ఆడుకోవడం అంటే తనకిష్టం- రష్మిక వీడియో

ఫిల్మ్ డెస్క్- రష్మిక మందన.. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఛలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, గీత గోవిందంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తరువాత మహేశ్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది రష్మిక. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పలో నటిస్తూ బాగా బిజీ అయిపోయింది.

rashmika mandanna 2

అన్నట్లు రష్మిక మందన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తన సినిమాలు, పర్సనల్ లైఫ్ కు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్యకాలంలో తనకు ఖాళీ సమయం దొరకడంతో ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తోంది రష్మిక. కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలు చెప్పింది. ఇక ముఖ్యంగా తన పెట్ తో ఆడుకుంటున్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది రష్మిక.

ఇక తన కుక్కపిల్లతో ఆడుకుంటున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రష్మిక మందన కళ్లజోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఇక ఆ చిన్ని కుక్కపిల్ల రష్మిక జుట్టుతో ఆడుకుంటోంది. ఛీవ్ స్టిక్స్‌ని నమలడం కంటే, నా జట్టును నమలడం తనకి ఎంతో ఇష్టం అని రష్మిక చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మికతో పాటు కుక్కపిల్ల కూడా ఎంతో క్యూట్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.