రేణూదేశాయ్ నంబర్ అడిగిన వ్యక్తి..ధిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రేణూ

ఫిల్మ్ డెస్క్- రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. బద్రి సినిమాలో పవన్ సరసన నటించి, ఆ తరువాత ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక విభేదాలు రావడంతో ఇద్దురు విడిపోయారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ విదేశీ వనితను పెళ్లి చేసకోగా, రేణూ దేశాయ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక రేణూ ఇంటా, బయట చాలా యాక్డీవ్ గా ఉంటారు. సోషల్ మీడియా ద్వార ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటారామె. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రేణూ దేశాయ్ చాలా కష్టాల్లో ఉన్న కొంత మందికి సాయం చేస్తున్నారు. కరోనా వల్ల ఉపాది కోల్పోయి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి రేణూ దేశాయ్ ఆహారాన్ని అందిస్తున్నారు. అంతే కాదు కరోనా రోగులకు అవసరమైన మందులను కూడా అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు రేణూ.

renu

ఈ క్రమంలో రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాంలోని ఇన్ బాక్స్‌ను ఓపెన్ చేసిపెట్టారు. అకరోనా కష్ట కాలంలో ఏదైనా అవసరం ఉన్న వారు ఇన్ స్టాగ్రామ్ ఇన్ బాక్స్‌ లో మెసెజ్ చేయాలని కోరారు. ఐతే రేణూ దేశాయ్ నలుగురికి సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఇచ్చిన మంచి అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్నారు. తామకు ఏదైనా అవసరం ఉంటే అది అడగకుండా, హాయ్ అంటూ పనికి మాలిన మెసెజ్‌లు పెడుతూ టైం వేస్త్ చేస్తున్నారు. కొందరైతే సాయం పేరిట డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు బెదిరించారు. దీంతో విసుగెత్తిపోయిన రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాం అకౌంట్‌లోని ఇన్ బాక్స్‌ను మూసివేశారు.

ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన రేణూదేశాయ్.. ఇకపై ఎవరికి ఏ అవసరం ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే తాను సాయం చేస్తానని చెప్పారు. ఆహారం, నిత్యావసర సరుకులు, చిన్న మొత్తంలో దొరికే మందులు అయితేనే తాను అందిస్తానని తెలిపారు. ఇటువంటి విషయాల గురించి రేణూ దేశాయ్ లైవ్‌లో మాట్లాడుతుండగా, ఓ నెటిజన్ రేణూను పర్సనల్ మొబైల్ నంబర్ ఇవ్వండని అడిగాడు. దీంతో కొంత వరకు షాక్ అయిన రేణూ దేశాయ్ మాత్రం ఎంతో హుందాగా సమాధానం చెప్పారు. తాను పర్సనల్ సెల్ నంబర్ ఇవ్వలేనని, ఎన్జీవో ప్రారంభిస్తే ఆ నంబర్ షేర్ చేస్తానని చెప్పారు. ఐతే ఇప్పుడు తన పర్సనల్ మొబైల్ నంబర్ ఇవ్వనని ఖరాకండిగా చెప్పేశారు రేణూ. ఏదైనా సాయం కావాలంటే ్డగాలి గాని ఇలా సెరబ్రెటీల సెల్ నంబర్స్ అడగటం సరికాదని నెటిజన్స్ ఆతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.