నర్సులతో కాలక్షేపం చేస్తున్న విజయ్ కాంత్.. ఫ్యాన్స్ ఖుష్

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పడింది. సినీ ఇండస్ట్రీ ఆర్థక నష్టమే కాదు.. ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. కొంత మంది నటీ,నటులు మాత్రం ఈ రక్కసి భారి నుంచి బయట పడ్డారు. కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

tamil actor1 compressedఈ మద్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దుబాయ్‌కు తరలించారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగు పడకుంటే అక్కడి నుంచి అమెరికాకు తీసుకెళుతామన్నారు. ఇదే సమయంలో విజయ్ కాంత్ ఆరోగ్యానికి సంబంధించి అనేక పుకార్లు వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విజయ్ కాంత్ తన ఆరోగ్యంపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను నటించిన క్షత్రియన్ సినిమాను ఆస్పత్రి నర్సులతో కలిసి చూస్తే విజయ్ కాంత్ కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే గత ఏడాది కరోనా బారినపడ్డారు విజయ్ కాంత్. వైరస్ సోకి ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ టైంలో కూడా ఆయన ఆరోగ్యపరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. కోవిడ్ నుంచి ఎలాగోలా కోలుకున్నా ఆయన అవయవాలపై ఎఫెక్ట్ పడిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నట్లు తెలుస్తుంది. తాను నటించిన క్షత్రియన్‌ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. తాజాగా విజ‌య్ కాంత్ త‌న హెల్త్ అప్‌డేట్ ఇవ్వ‌డంతో ఫ్యాన్స్, డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.