దగ్గుబాటి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బాబాయ్ అబ్బాయ్ కాంబోలో మూవీ ఫిక్స్!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించిన డి.రామానాయుడు ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా ‘కలియుగపాండవులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు దగ్గుబాటి వెంకటేష్. మొదట యాక్షన్ చిత్రాల్లో నటించినా.. తర్వాత ఫ్యామిలీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎక్కవగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు వెంకటేష్.

ranaje3 minరామానాయుడు పెద్ద కుమారుడు  డి.సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రలకైనా సిద్దమయ్యే రానా ‘బాహుబలి’ సీరీస్ లో విలన్ గా తన విశ్వరూపాన్ని చూపించాడు. హీరో.. విలన్ ఏ పాత్రలకైనా సిద్దం అంటున్నాడు. అయితే దగ్గుబాటి వారసులైన వెంకటేష్- రానా కాంబో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఒకే తెరపై బాబాయ్ అబ్బాయ్ లను చూడాలని కుతూహలంగా ఉన్నారు. తాజాగా ఆ కోరిక త్వరలోనే నెరవేరనుందని తెలుపుతూ అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చేసింది.  కాక‌పోతే.. వెండి తెర కోసం కాదు. అది ఓటీటీ కోసం. నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ, రానా ఇద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ వెబ్ సిరీస్ లో న‌టించారు. దీనికి `రానా నాయుడు` అనే టైటిల్ ఖరారు చేశారు. సుప‌ర్ణ్ ద‌ర్శ‌కుడు.

ranagve min

ఓటీటీ అనేది వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పెయిడ్ ఓటీటీలు వచ్చి ఇతర భాషల్లో ఉన్న వెబ్ సిరీస్ లు అన్నీ మనకు అందుబాటులోకి తెచ్చాయో అప్పుడే వాటి లెవెల్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం హీరోహీరోయిన్లు ఓటీటీలోకి ఎంటరయ్యి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను చేస్తూ రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి దగ్గుబాటి హీరోలు చేరబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి? ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అనే విష‌యాల్ని నెట్ ఫ్లిక్స్ త్వ‌ర‌లోనే వెల్ల‌డి చేయ‌బోతోంది.

vnega minఈ సందర్భంగా ‘ఓ చిన్నపిల్లాడి నుంచి మంచి పరిణితి చెందిన నటుడిగా నా ముందు ఎదిగిన రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. త్వరలోనే ‘రానా నాయుడు’ మీ ముందుకు వస్తుంది’అంటూ ట్వీట్ చేశారు వెంకటేశ్. ఇక వెంకీమామతో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు రానా దగ్గుబాటి. ఇలా తన కల నెరవేరబోతోందని తెలిపిన ఆయన వెంకీని ఆఫ్ స్క్రీన్ మీద ఎంతగా ప్రేమిస్తున్నానో ‘రానా నాయుడు’ లోనూ అంతే అలాగే ఉంటూ ఒకే గొంతుకగా నటిస్తున్నామని అంటూ ట్వీట్ చేశాడు రానా. కాగా, ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్ టీమ్. ఈ అప్డేట్ తో దగ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.