రాంచరణ్ వాయిస్ ఓవర్ తో ‘గని’టీజర్ అదుర్స్!

తెలుగు ఇండస్ట్రీలో మెగాబ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘కంచె’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. మద్యలో కాస్త తడబడినా.. ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గని’. ఈ చిత్రం ను సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

gani minఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. . ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘ప్రతి ఒక్కరి కథలో కష్ఠాలు ఉంటాయి ..కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి.. కోపాలు ఉంటాయి.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది.

gag min 2ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై..యూ… ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. అంటూ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ చేసింది. ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టితో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సహజత్వం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇక విడుదలైన ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.