బాలకృష్ణ యాంకర్ గా అన్ స్టాపబుల్ షో. ప్రోమో అదిరింది!

Balayya unstopable aha

కొత్తదనం కోసం పరితపించే సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. దశాబ్దాల సినీ కెరీర్ లో హీరోగా ఆయన చేయని ప్రయోగం లేదు. అయితే.., ఇప్పుడు సరికొత్తగా వ్యాఖ్యాతగా మారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు బాలయ్య. బాలకృష్ణ యాంకర్ గా ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్‌’ అనే కార్యక్రమం నవంబరు 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ కార్యక్రమం కర్టెన్‌ రైజర్‌ జరిగింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లు అరవింద్ కుటుంబానితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. ఎన్నో ఎదురు దెబ్బలు ఉంటాయి. ఆ కష్టాలు అన్నిటిని తట్టుకుని నిలబడితేనే ఒక లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటి వారి అంతరంగాన్ని బయట పెట్టడమే ‘అన్‌స్టాపబుల్‌’ కాన్సెప్ట్‌ అని బాలయ్య తెలియ చేశారు. ఇక ఈ సందర్భంగా విడుదలైన ‘అన్‌స్టాపబుల్‌’ బాలయ్య ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి.. ఈ సరికొత్త ప్రయాణంలో బాలయ్య యాంకర్ గా సక్సెస్ అవుతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.