టక్‌ జగదీష్‌ రివ్యూ

నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు
దర్శకుడు: శివ నిర్వాణ
నిర్మాత‌లు: సాహు గారపాటి, హ‌రీశ్ పెద్ది
సంగీత దర్శకుడు: తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021

తెలుగు ఇండస్ట్రీలో అష్టా చమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాని. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో సినిమాలు చేస్తూ నేచుర‌ల్‌గా పేరు తెచ్చుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కింది ‘టక్ జగదీష్’. కోవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండ.. అమెజాన్ ప్రైమ్‌లో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను డైరెక్ట్ రిలీజ్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ నాని ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుద‌లైంది. అమెజాన్‌లో విడుద‌ల చేయ‌డంపై డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ త‌మ నిర‌స‌న కూడా వ్య‌క్తం చేశారు. ‘నిన్నుకోరి’ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సెకండ్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

jagadesh minకథ :
భూదేవిపురం అనే ఓ ఊరిలో ఆది శేష‌గిరి నాయుడు (నాజ‌ర్‌)ది పెద్ద కుటుంబం. ఆయనకు బోస్ (జ‌గ‌ప‌తిబాబు), ట‌క్ జ‌గ‌దీష్ (నాని) ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కూతుళ్లు. అదే ఊర్లో ఉండే వీరేంద్ర నాయుడు(డానియ‌ల్ బాలాజీ) ప్రతిసారి గొడవలు సృష్టిస్తుంటాడు. తన తండ్రి చావుకి కారణం ఆది కేశ‌వులు అని అత‌ని కుటుంబంపై ప‌గ పెంచుకుంటాడు. వీటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే శేష‌గిరి నాయుడు హఠాత్తుగా చనిపోతాడు. ఆ తర్వాత బోస్, వీరేంద్రతో చేతులు కలపడంతో పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోతాయి. కుటుంబమంతా విడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టక్ జగదీష్ తన సొంతూరుకు ఎమ్మార్వోగా వస్తాడు. వీరేంద్ర ఆటలు ఎలా కట్టిస్తాడు.. వీరేంద్ర‌తో చేతులు క‌లిపిన బోసుకి ఎలాంటి పరిస్థితి ఎదుర‌వుతుంది? తన అన్నను టక్ జగదీశ్ ఎలా మారుస్తాడు.. మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కలిపాడు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ :
నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లు ప్రజల బాగు కోరే మనిషి గా ఆది శేష‌గిరి నాయుడు ఊరిపెద్దగా ఉంటారు. అతని మంచికి ప్రతిసారి అడ్డు తగిలి ఊర్లో, కుటుంబంలో గొడ‌వ‌లు సృష్టించడం విలన్ చేసే పని. ఇలాంటి ఫార్ములాతో న‌డిచే క‌థ‌ల‌ను మ‌నం ఎన్నింటినో తెర‌పై చూశాం. డైరెక్టర్ తెలిసిన కథనే మరింత ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు నాజ‌ర్ పాత్ర చ‌నిపోయే వ‌ర‌కు ఫ్యామిలీ, ఎమోష‌న‌ల్ అంశాల‌తోనే సినిమాను న‌డిపించారు. త‌ర్వాతే జ‌గ‌ప‌తిబాబు పాత్ర.. విల‌న్‌తో చేతులు క‌ల‌ప‌డం.. ఫ్యామిలీలో గొడ‌వ‌లు మొద‌లు ఇలా క‌థ నెక్ట్స్ స్టెప్ తీసుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో ఎమ్మార్వోగా ఊల్లోకి రాగానే అన్న‌కు ఎదురు తిర‌గ‌డం.. విల‌న్ భ‌ర‌తం ప‌ట్ట‌డం వంటి స‌న్నివేశాలతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. సినిమాలో సిస్ట‌ర్ సెంటిమెంట్స్ చాలా అద్భుతంగా చూపించారు. నాని తనదైన శైలిలో సినిమా అంతా తానై ముందుకు నడిపించాడు. ఎమోషనల్ సీన్స్, ఫైట్స్‌లో త‌న‌దైన స్టైల్‌ను చూపించి మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే నాని కూడా కొత్తగా మాస్ హీరోలా కనిపించాడు.

jaaes minగ‌త చిత్రాల్లో క‌నిపించే ఓ హ్యుమ‌ర్ ఈ సినిమాలో కాస్త మిస్ అయ్యింద‌నే చెప్పాలి. పొలం ఫైట్ అయితే చాలా స్టైలిష్‌గా తీసారు. పాటకు ఫైట్ పెట్టడం అల వైకుంఠపురములో సినిమాను గుర్తు చేసింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చక్కని కుటుంబ భావోద్వేగాలతో నడిచింది. ప్రీ-ఇంటర్వెల్ సమయంలో తీసుకొచ్చిన ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి. జ‌గ‌ప‌తిబాబు ఒక వైపు మంచివాడుగా కాసేపు, గ్రేషేడ్స్‌తో కాసేపు న‌టించారు. ఆయ‌న సునాయ‌సంగా త‌న పాత్ర‌ను క్యారీ చేసేశారు. ఇక రావు ర‌మేశ్‌, రోహిణి, వి.కె.న‌రేశ్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అయితే ఐశ్వర్య రాజేష్ పాత్రను సరిగ్గా పెద్దగా ఎలివేట్ చేయలేదు. రీతూ వర్మ ఒక ఆఫీసర్ గా మంచి నటన కనబరిచింది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఉండే సినిమాటిక్ లిబ‌ర్టీని ద‌ర్శ‌కుడు బాగానే వాడినట్లు తెలుస్తుంది.

నటీనటులు :
నేచురల్ స్టార్ నాని మరోసారి తన సత్తా ఏమిటో చాటాడు.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో బాగా కనెక్ట్ అయ్యాడు..జగదీష్ నాయుడుగా కొత్తగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఏ పాత్ర ఇచ్చినా తనను తాను కొత్తగా చూపించుకోడానికి ప్రయత్నిస్తాడు అందుకే నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. లేడీ ఆఫీసర్ గా రీతూ వర్మ పరవాలేదు అనిపించుకుంది. పెద్దగా పాత్ర లేకున్నా ఐశ్వర్య రాజేష్ బాగానే మెప్పించింది. తమిళ నటుడు డేనియల్ బాలాజీ తెలుగులో కనిపించాడు. ఆయన విలనిజం బాగానే చూపించాడు. జగపతి బాబు మరోసారి తన మేనరీజం చూపించాడు.. మంచిగానే ఉంటూ విలన్ గా మారడం.. తర్వాత మారిపోవడం తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక రావు ర‌మేశ్‌, రోహిణి, వి.కె.న‌రేశ్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం :
త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించిన పాట‌ల్లో ఇంకోసారి ఇంకోసారి .. అనే సాంగ్ బావుంది. మిగ‌తా సాంగ్స్ పర్లేదు. ఇక గోపీసుందర్ నేప‌థ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, కెమెరా పనితీరు ఆకట్టుకుంది. డైలాగ్స్ చక్కగా ఉన్నాయి కానీ స్క్రీన్ ప్లే మాత్రం డల్ గా అనిపించింది. దర్శకుడు శివ నిర్వాణ విషయానికి వస్తే ఒక సాధారణ కథను తీసుకున్నా కూడా భావోద్వేగాలను మాత్రం చక్కగా చూపించగలుగుతాడు.

మజిలీ, నిన్ను కోరి చక్కటి భావోద్వేగాలను చూపించాడు. కానీ కొన్ని కీలక సందర్భాల్లో భావోద్వేగాలు చాలా కృత్రిమంగా కనిపిస్తున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే ‘టక్ జగదీశ్’ ఒక మంచి ఫ్యామిలీ టచ్ ఎమోషన్స్ మరియు మంచి ట్విస్టులను కలిగి ఉంది. సెకండ్ హాఫ్‌లో కథనం కాస్త దెబ్బతిన్నప్పటికీ ప్రీ-క్లైమాక్స్ మరియు ఎండింగ్‌ని బాగా ముగించారు. నాని ఉన్నాడు కాబట్టి చూడొచ్చు అనేలా ఉంది తప్ప సినిమాగా చూస్తే టక్ జగదీష్ శివ నిర్వాణ స్థాయి సినిమా కాదు.

ప్లస్ పాయింట్స్ : నాని, జగపతిబాబు, సాంకేతిక పనితీరు

మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ లో బోరు సీన్లు, సెకండ్ ఆఫ్ స్లోగా సాగే కథనం

రేటింగ్ : 2.7/5

బాటం లైన్ : జగదీష్‌ కొత్తగా ఉన్నా.. కథ రొటీన్