ఇండస్ట్రీలో ఇద్దరూ ఇద్దరే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇస్తే ఉక్కుపాతరేస్తారు. కానీ బైక్ ఇస్తే మాత్రం నడపడం రాదని ఒకరు, ఎవరికైనా డబ్బులు పంపమంటే ఫోన్ పే చేయడం తెలియదని అంటారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా?
బైక్ నడపడం ఒక ఆర్టు అని కొందరి ఫీలింగ్. అయితే అదే బైక్ నడపడం కొందరికి ఫియర్ ఇన్ హార్టు. ఒక కాలితో గేరు మారుస్తూ మరో కాలితో బ్రేక్ వేస్తూ బండి నడుపుతుంటే ఆ దర్జానే వేరు, అయితే కొందరికి బైక్ నడపడం అంటే భయం. కొందరికి నేర్చుకునే ఆసక్తి, నడపాలన్నా మూడు, ఉత్సాహం లాంటివి ఉండవు. స్కూటీతో సరిపెట్టుకునేవారు కొందరైతే.. కార్లు ఉన్న కారణంగా ఎప్పుడూ బైక్ ఎక్కే అవకాశం లేనోళ్ళు కొందరు. ఈ భూమ్మీద ఉన్నోళ్లు కూడా లేనోళ్లే. చుట్టూ పనోళ్ళు, ఇంటా, బయటా మనోళ్లు, కార్లు, భవనాలు ఎన్ని ఉంటే ఏమి.. బైక్ నడపడం రాదు కొందరు ధనవంతులకి. అసలు బైక్ నడపాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి వాళ్లకి. బహుశా ఈ కారణంగానే కాబోలు ఒక స్టార్ హీరోకి బైక్ డ్రైవింగ్ రాలేదు.
విలక్షణ నటుడిగా తనకంటూ పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానాకి బైక్ నడపడం రాదంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ మూవీ ఈవెంట్ లో భాగంగా ఆయన బైక్ డ్రైవింగ్ రాదని అన్నారు. తనకు బైకులతో కనెక్షన్ లేదని, ఎప్పుడూ బైక్ నడపలేదని, తనకు నడపడం రాదని అన్నారు. అయితే తనకు బైక్ నడిపే వాళ్లంటే ఇష్టమని, వారికి తాను పెద్ద ఫ్యాన్ అని అన్నారు. ఇక మరొక హీరోకి ఐతే ఫోన్ పే చేయడం రాదంట. ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ యాప్ లలో ఫుడ్ ఆర్డర్ పెట్టడం తెలియదట. ఆ హీరో మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని.
దసరా వంటీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నానికి అసలు ఫోన్ పే యూజ్ చేయడం రాదంట. టెక్నాలజీ వినియోగం తెలియదంట. తాను టెక్నికల్లీ హ్యాండీక్యాప్డ్ అని, ఫోన్ పే, గూగుల్ పే వాడడం కూడా రాదని, కనీసం ఫుడ్ ఆర్డర్ ఎలా పెట్టాలో కూడా తెలియదని దసరా ప్రమోషన్ అప్పుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేనా బ్యాంకు పనులు ఎలా చేయాలో కూడా తెలియదని పేర్కొన్నారు. మరి మీలో రానాలా బైక్ డ్రైవింగ్ రానివారు ఎంతమంది ఉన్నారు? నానిలా టెక్నాలజీ వాడడం తెలియని వారు ఎంతమంది ఉన్నారు? ఉంటే కనుక మీరు ప్రమాదాలకు దూరంగా ఉన్నట్టే.