టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలన నిర్ణయం! పోసానిపై నిషేధం?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ మూవీ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ, వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పెను దుమారం రేపాయి. ఇంతలోనే నటుడు పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి.., పవన్ కళ్యాణ్ పై దారుణ‌మైన కామెంట్స్ చేశాడు. మరుసటి రోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది తనకు ఫోన్ లో చంపేస్తామంటూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూనే ఉన్నారని, తన భార్య పైన కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. చిరంజీవి తమ్ముడిని కంట్రోల్ లో ఉంచుకోవాలని అన్నారు. ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశాడు పోసాని.

toage min 1

ఈ క్ర‌మంలో పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. తానురాళ్ల దెబ్బలకు భయపడిపోయేవాడిని కాదని, ఇలాంటి బెదిరింపులు చాలా చూశానని.. మహా అయితే చంపేస్తారేమో అంటూ వ్యాఖ్యనించారు. అయితే పవన్ కుటుంబపై పోసాని చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ నిర్మాతలు కూడా విసుగు చెందినట్లు సమాచారం. ఈ క్ర‌మంలో పోసానిపై 5 సంవత్సరాల నిషేధాన్ని విధించాలన్న అభిప్రాయంలో ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మా ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్,మంచు విష్ణు పానెల్ మద్య గట్టి పోటీ నెలకొంది.

ajege minపోసాని చేసిన వ్యాఖ్యలపై మా ఎలక్షన్లో పోటీ చేస్తున్న వారు గట్టిగానే ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇక మా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. సినీ పెద్దలతో చర్చలు జరిపి పోసానిపై చర్యలు తీసుకుంటారమో అన్న టాక్ కూడా ఫిలిమ్ వర్గాల్లో వినిపిస్తుంది. పోసానిని అఫిషియల్ గా బహిష్కరిస్తారా.. లేదా అనధికారికంగా అవకాశాలు రాకుండా చూడాలా అన్న విషయంపై కూడా చర్చలు నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో ఇవ్వండి.