మా ఎన్నికల్లో ఊహించని మలుపు.. సంచలన నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్ !

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మరో మలుపు తీసుకుంది. మొదటి నుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతిస్తూ వెన్నంటి నిలిచిన బండ్ల గణేష్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నాని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తానని తెలిపి అందరిని ఖంగుతినేలా చేశారు. ఇక ట్విట్టర్ లో ప్రకటించిన అయన.. మాట తప్పను … మడమ తిప్పను నాది ఒకటే మాట ఒకటే బాట నమ్మడం నమ్మినవారికోసం బతకడం నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటానని తెలిపారు.

నేను ఎవరిమాట వినను, త్వరలో జరిగే మా ఎన్నికల్లో సెక్రెటరీ గా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని తెలిపారు బండ్ల గణేష్. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదని, నన్ను పోటీ చెయ్ అంటోందని అన్నారు. అందుకే ఈ పోటీలో అందరికీ అవకాశం ఇచ్చారని ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా అంటూ బలంగా చెప్పారు. ఇక నా పరిపాలన ఎంటో తెలియచేస్త, వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం, దానికోసం పోరాడతానంటూ చెప్పుకొచ్చారు. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు. ఇక ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు. ఇకనుంచి అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి. మా ను బలో పేతం చేద్దాం.

The Movie Artist Association Elaction Another Turn - Suman TVముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం. అదే మా నిజమైన అభివృద్ది… చిహ్నం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇక గతంలో హేమ, జీవిత మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించి అనూహ్య పరిణామాల మధ్య ప్రకాష్ రాజ్ కి ప్యానల్ లోకి వెళ్ళటం సినీవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మా ఎన్నికల్లో రాను రాను ఇంకా మరిన్ని ట్విస్టులు జరగబోతాయంటూ సినీ ప్రముఖులు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.