గున్న ఏనుగుకి పునీత్ రాజ్ కుమార్ పేరు!

కన్నడ పవర్ స్టార్ రాజ్ కుమార్ హఠాన్మరణం కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ తారలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధి వద్ద వేల సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని సక్రెబైలు ఏనుగు శిక్షణ కేంద్రంలోని ఓ గున్న ఏనుగుకు ఇటీవల కన్నుమూసిన పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. రెండేళ్ల వయసున్న ఈ ఏనుగు అంటే పునీత్‌కు ఎంతో ఇష్టమని అధికారులు తెలిపారు.

pure compressedఇటీవల పునీత్ ఈ క్యాంప్ సందర్శించి ఆ గున్న ఏనుగుతో ఎంతో హ్యాపీగా గడిపినట్లు అధికారులు తెలిపారు. ఆ గున్న ఏనుగుపై విపరీతమైన వాత్సల్యం చూపించిన పునీత్ ఎక్కువ సమయం దానితోనే కాలక్షేపం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఏనుగు పిల్లకు నటుడి పేరు పెట్టడంపై ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ నాగరాజ్ మాట్లాడుతూ.. సాధారణంగా ఎనుగులకు దేవుళ్ల పేర్లే పెడతామన్నారు. కానీ, ఈసారి స్థానికులు, సిబ్బంది కోరిక మేరకు పునీత్‌కు ఎంతో ఇష్టమైన ఈ ఏనుగు పిల్లకు ఆయన పేరుపై నామకరణం చేసినట్టు చెప్పారు.

enau compressedఈ ఏడాది మొదట్లో ఏనుగుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ఒకసారి ఈ కేంద్రాన్ని పునీత్ సందర్శించారు. ఆ సమయంలో ఈ గున్న ఏనుగుతో ఎంతో ఆనందంగా గడిపినట్లు ఆయన తెలిపారు. అంత గొప్ప నటుడు, సంఘ సంస్కర్త.. సేవా హృదయం కలిగిన పునీత్ రాజ్ కుమార్ మన మధ్యలో లేకపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.