ఓ పెద్ద మొసలితో తల్లి ఏనుగు చేసిన పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్ల కోసం ఆ తల్లి ఎంత ఆరాటపడిందో చూస్తూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..
‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు’ కేజీఎఫ్ సినిమాలోని ఈ ఒక్క డైలాగ్‌తో తల్లి గొప్పతనం గురించి సుత్తి లేకుండా చెప్పేశాడు రచయిత. తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలిస్తుంది.. అవరసరమైతే ప్రాణాలు తీస్తుంది. ఎంతటికైనా తెగిస్తుంది. అది మనిషే కానక్కర్లేదు.. ఈ సృష్టిలోని తల్లి అయిన ఏ జీవి అయినా బిడ్డ కోసం తెగువను చూపిస్తుంది. తాజాగా, ఓ ఏనుగు తన బిడ్డ కోసం మొసలితో పోరాటం చేసింది. పెద్ద మొసలిని తరమికొట్టింది. ప్రముఖ ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నంద ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
‘‘ఏనుగులు తమ బిడ్డల్ని కాపాడుకోవటానికి ఎంత దాకా వెళతాయో చూస్తే మతి పోతుంది. ఇదిగోండి ఓ చిన్న సంఘటన. మొసలి సరెండర్ అయిపోయింది’’ అని పేర్కొన్నారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంట.. ఓ ఏనుగు.. తన పిల్లతో కలిసి నీళ్లు తాగటానికి ఓ నీటి కుంట దగ్గరకు వెళ్లింది. పిల్ల ఏనుగు నీళ్లలోకి దిగింది. తల్లి ఏనుగు బయటే ఉండి నీళ్లు తాగుతూ ఉంది. పిల్ల ఏనుగు నీళ్లలో సరదాగా ఉండగా తల్లి ఏనుగు నీళ్లలో ఏదో ఉండటం గమనించింది. ఇంతలో ఓ ముసలి పిల్ల ఏనుగు మీదుకు వెళ్లబోయింది.
తల్లి ఏనుగు ఒక్క ఉదుటున మొసలిపై పడింది. తన పాదాలతో.. తొండంతో దానిపై దాడి చేసింది. దీంతో మొసలి గిలగిల్లాడింది. ఆ వెంటనే అక్కడినుంచి పరారయ్యింది. తల్లి ఏనుగు ఊపిరి పీల్చుకుంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ తల్లి ప్రేమ అంటే ఇదే మరి’’..‘‘ ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఇంకోటి ఉండదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The extent to which elephants can go in protecting their calves is mind boggling. Here is a small incidence. The Crocodile had to surrender 👌 pic.twitter.com/ntbmBtZm9F
— Susanta Nanda (@susantananda3) April 14, 2023