ప్రైవేట్ జెట్ ప్రమాదంలో టార్జాన్ స్టార్ హఠాన్మరణం!..

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్​ లారా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోయ్​ లారా ‘టార్జన్​’ సిరీస్​లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. సౌత్​ నాష్​విల్లేలోని పెర్సీ స్ట్రీక్​ లేక్​లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్​ లారా, అతని భార్య గ్వెన్​ ష్వాంబ్లిన్ ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనలో శకలాలు చెల్లాచెదురు అయ్యాయని, సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు.  జో లారా ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ అమెరికాలోని నాష్‌విల్లేకు దగ్గర్లోని ఓ సరస్సులో కూలింది.

Tarzan star

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.  విలియమ్​ జోసెఫ్​ లారా 1989లో వచ్చిన ‘టార్జాన్ ఇన్​ మాన్​హట్టన్’​ సినిమా ద్వారా ఫేమస్​ అయ్యారు. ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు టెలికాస్ట్ అయిన ‘టార్జాన్​ ది ఎపిక్​ అడ్వెంచర్స్’ టీవీ సిరీస్​ ద్వారా గ్లోబల్​ వైడ్ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. స్వతహాగా మార్షల్​ ఆర్ట్స్​ నిపుణుడైన​ లారా.. టార్జాన్​గా డూప్​ లేకుండా స్టంట్స్​ చేసేవారు. ఇక చాలా ఆలస్యంగా 55 ఏళ్ల వయసులో లారా గ్వెన్​ ష్వాంబ్లిన్​ను 2018లో వివాహం చేసుకున్నాడు.