డబ్బున్నవాడే కావాలంటున్న సురేఖ వాణి

ఫిల్మ్ డెస్క్- సురేఖావాణి.. వెండితెర, బల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా చక్కటి అందంతో పాటు, ఆకట్టుకునే నటనతో అలరిస్తోంది సురేఖ. సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే.. సోషల్ మీడియాలో  బాగా యాక్టివ్ గా ఉంటుంది సురేఖా వాణి. ఇక కుర్రకారులో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పక తప్పదు. సురేఖా వాణి ఇటీవల సోషల్‌ మీడియాలో మాత్రం హాట్‌ హాట్ ఫోటోలు పెడుతూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లీడుకు వచ్చిన తన కూతురుతో కలిసి అప్పుడప్పుడూ హంగామా చేస్తుంది. తాజాగా సురేఖవాణి ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్బంగా పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌ ప్రారంభమై 22 ఏళ్లు అవుతుందని చెప్పిన సురేఖ.. ముందు సిటీ కేబుల్‌లో కెరీర్‌ స్టార్ట్ అయ్యిందని తెలిపింది.

తన ఫోటోలంటే యూట్యూబ్, వెబ్‌సైట్ల వాళ్లకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక రెండో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు చాలా సూటిగా సమాధానం చెప్పింది సురేఖవాణి. తనకు మనసున్న వాడికంటే డబ్బున్న వాడే కావాలని మొహమాటం లేకుండా చెప్పింది. అంతే కాదు మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని, డబ్బున్న వాడైతేనే బావుంటుందని వివరణ ఇచ్చింది సురేఖవాణి. తాను  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేశ్‌ మృతి గురించి ఆమె మాట్లాడుతూ సురేఖ ఏడ్చేసింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేయలేదేని, తాను ఎంతో కష్టపడి తన కూతురును పెంచానని చెప్పుకొచ్చింది. తమపై అనవసర కామెంట్స్ చేసే వారికి కాస్తైనా సిగ్గుండాలని ఘటుగానే స్పందించింది సురేఖవాణి. మరి ఆమె కోరుకున్నట్లు డబ్బున్నవాడే సురేఖకు భర్తగా దొరకాలని కోరుకుందామా.