నటి సురేఖా వాణి.. హీరోయిన్ వయస్సు కుమార్తె ఉన్న ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపింది.
తెలుగు సినిమా రంగంలో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా రచ్చ జరగాల్సిందే. బోల్డ్ (ముఖ్యంగా అమ్మాయిలను ఉద్దేశించి) కామెంట్స్ చేస్తూ ఉంటారు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని కాంటవర్సీలు క్రియేట్ చేస్తారు. వార్తా చానల్స్, మీమర్లకు పని చెబుతారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖా వాణి. హీరోయిన్ అయ్యే కుమార్తె ఉన్నా ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ చర్చించుకునేలా చేస్తారు. ఇప్పుడు వీరిద్దరి పేర్లు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేస్తుందని పేరుంది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె .. తర్వాత నటిగా మారింది. అయితే ఆమె భర్త చనిపోయిన తర్వాత.. ఆఫర్లు తగ్గగా.. కూతురుతో కలిసి.. సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లీడు కూతురున్నా.. ఆమె కన్నా యంగ్‌గా కనిపిస్తోంది సురేఖ. అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ పోస్టు పెను సంచలనమైంది. అదే కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మతో కలిసి దిగిన ఫోటో. ఓ నైట్ పార్టీ సందర్భంగా వీరు కలిసినట్లు సమాచారం. ఇందులో రామ్ గోపాల్ వర్మకు క్లోజ్‌గా, టైట్ హగ్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. వర్మ చేతిలో గ్లాస్ ఉండగా.. వీరిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో పాటు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు ఈ పార్టీలేమీ కొత్త కాదూ. గతంలోనూ పలు పార్టీలతో కొంత మంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ వారిని ఫేమస్ కూడా చేస్తుంటారు. వర్మ తప్పతాగి ఓ అమ్మాయితో చిందులు వేశాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ.. రచ్చ రచ్చ చేశాడు. ఆమె చుట్టు డాన్స్ వేస్తూ..చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. కాళ్ల మీద పడ్డాడు. ఆమెనే ఇనయా సుల్తానా. ఆ తర్వాత బిగ్ బాస్ 6లోకి వచ్చి సందడి చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ బ్యూటీలు అరియానా, అషూ రెడ్డితో చేసిన ఇంటర్వ్యూలతో వారిని ఎంత ఫేమస్ చేసిన సంగతి అందరికీ విదితమే. తాజాగా సురేఖ, ఆర్జీవీ రిలేషన్ ఎటు దారి తీస్తుందని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.