చంద్రబాబుకు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్

Chandrababu Naidu Rajinikanth Ap Assembly

ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన, చంద్రబాబు కంటతడి ఎపిసోడ్ ఈ రెండు ఘటనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు నాయుడు భార్యపై వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడారని చంద్రబాబు మీడియా సమక్షంలో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై రాజకీయ పార్టీలకు అతితంగా కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

అయితే దీనిపై నందమూరి కుటుంబంలోని ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. బాలక్రిష్ణ, ఎన్టీఆర్, వంటి అనేక మంది స్పందించారు. అయితే తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి ఓదార్చారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన, మీడియా సమక్షంలో వెక్కి వెక్కి విలపించడం మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ శనివారం ఉదయం చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ఈయనతో పాటు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేయటం బాధకలిగించాయని ఆయన అన్నారు.