స్టార్ హీరోలకి తలనొప్పిగా మారిన సోనూసూద్ !

సోనూసూద్.. ఇప్పుడు దేశంలో ఎక్కడ పట్టినా ఈ సూపర్ హీరో పేరే వినిపిస్తోంది. కష్ట కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్నసోనూని ప్రజలు రియల్ హీరోగా గుర్తించేశారు. ఫేస్ బుక్ ప్రొఫైల్స్, వాట్సాప్ డీపీలు ఎక్కడ పట్టినా సూనుసూద్ ఫొటోలే. సోనూసూద్ వాళ్ళకి సహాయం చేశాడట, వీళ్ళకి సహాయం చేశాడన్న వార్తలే. ఒక దేశ ప్రభుత్వం చేయాల్సినంత పని సోనూసూద్ ఒక్కడే చేసేస్తున్నాడు. దీనితో సోనూకి నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేసింది. దెబ్బతో ఆ ఆన్ స్క్రీన్ విలన్.. ఆఫ్ స్క్రీన్ లో హీరో అయిపోయాడు.

సోనూసూద్ కి ఇంత క్రేజ్ రావడం అందరికీ ఆనందంగా ఉన్నా.., మన స్టార్ హీరోలకి, దర్శక, నిర్మాతలకి మాత్రం కాస్త ఇబ్బందిగా మారిందట. అయితే.., ఇందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు సోనూ సూద్ను విలన్గా చూపిస్తే ప్రేక్షకులు బాగానే యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు. ఇప్పుడు సోనూసూద్ ని తెరపై ప్రతినాయకుడిగా చూపించడం అంత సులభం కాదు. దానికి ఆయన రియల్ ఇమేజ్ అడ్డు వస్తుంది. ఒకవేళ సినిమాలో కథాపరంగా మన హీరోలు సోనూసూద్ ని కొట్టినా అభిమానులు తట్టుకునే పరిస్థితి లేదు. ఇన్ని రిస్ట్రక్షన్స్ మధ్య సోనూతో సినిమాలు చేయాల్సి రావడం మేకర్స్ కి కాస్త కష్టమైన పనే.

ఈ విషయంలో మన హీరోల బాధ ఇంకా వర్ణనాతీతం. సినిమాలో సూనుసూద్ ఉంటే మిడ్ రేంజ్ హీరోలని ఇప్పుడు కచ్చితంగా డామినేట్ చేసేస్తాడు. ఒకవేళ స్టార్ హీరోలు ఉంటే వారు కూడా సోనూసూద్ తో ఆన్ స్క్రీన్ వార్ చేయలేరు. ఒకవేళ చేసినా.., తమ రియల్ హీరోని.. జస్ట్ ఆన్ స్క్రీన్ కొట్టడం ఏమిటన్న కామెంట్స్ వినిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకో సమస్య ఉంది. సోనూసూద్ హీరో కాకపోయినా తన దగ్గర ఉన్నది మొత్తం ఊడ్చి ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఈ స్థాయిలో సేవ చేసిన హీరోలు లేరు. దీనితో.., స్టార్ హీరోలు సూనుసూద్ ని చూసి నేర్చుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా సూనుసూద్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్ట పడకపోవచ్చు.

star 2

సంక్రాంతికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా ఇదే సమస్య ఎదురైంది. సోనూసూద్ క్యారెక్టర్ను విలన్గా చూపించలేక.., మంచిగా మార్చలేక దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తలనొప్పి ఎదుర్కొన్నాడు. ఆచార్య సినిమాలో సోనూ సూద్ ను స్క్రిప్ట్ పరంగా కొట్టాలి అంటే నేను అల చేయలేను అంటూ చిరంజీవి అంతటి స్టారే వెనకడుగు వేశాడు. సో.. ఇక మిగతా హీరోల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో అసలు సోనూసూద్ నే హీరోగా మార్చేసే పనిలో పడ్డారట మేకర్స్. ఇప్పటికే సోనూసూద్ హీరోగా రెండు భారీ బడ్జెట్ మూవీస్ సెట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? సినిమాలలో సోనూసూద్ విలన్ గానే కంటిన్యూ అవ్వాలా? లేక హీరోగా టర్న్ తీసుకోవాలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.