కొడుకుపై షారూఖ్ ఖాన్ సంచలన కామెంట్.. వీడియో వైరల్!

బాలీవుడ్ లో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్టు చేయడం కలకలం రేపుతుంది. డ్ర‌గ్స్ కేసులో ఆర్యన్ సహ ఎనిమిది మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు. అయితే రేవ్ పార్టీలో షారూఖ్ తనయుడితో పాటు మరికొంత మంది బడా పారిశ్రామిక వేత్తల తనయులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : ఆ వీడీయో చూసి కన్నీరు పెట్టుకున్న యాంకర్ రష్మి!

sahrg minతాను పార్టీకి ఓ గెస్ట్‌గా మాత్ర‌మే అక్క‌డికి వెళ్లిన‌ట్లు విచార‌ణ‌లో ఆర్య‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం. తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో తెలిపినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఆర్యన్ తో పాటు.. అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్‌సీబీ కార్యాలయంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఎన్సీబీ అదుపులో ఉన్నాడు. ఈ సందర్భంగా గతంలో షారూఖ్ తన కుమారుడి గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇదీ చదవండి : కలలు కనొద్దు.. విడాకుల అనంతరం తొలిసారి స్పందించిన సమంత

ఇదిలా ఉంటే గతంలో షారుక్‌ తన కుమారుడిపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో షారూఖ్ అతని భార్య గౌరి పాల్గొన్నారు.. యాధృచ్చికంగా కామెడీగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సిమి గేర్‌వాల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్‌.. ‘నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్‌ చేయొచ్చు. సిగరెట్‌ తాగొచ్చు. సెక్స్‌, డ్రగ్స్‌ని కూడా ఆస్వాదించొచ్చు. అన్ని రకాలుగా అతను ఎంజాయ్‌ చేయవచ్చు.. మంచి అబ్బాయిలా కనిపించడం మొదలుపెడితే నేను ఇంటి నుంచి తరిమేస్తాను’అంటూ షారుక్‌ సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అప్పుడేదో సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కొడుకుని అంత ఫ్రీగా వ‌దిలేస్తే ఇలాంటి పనులే చేస్తారంటూ నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.