ఆ వీడీయో చూసి కన్నీరు పెట్టుకున్న యాంకర్ రష్మి!

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో పాపురల్ అయిన యాంకర్స్ లో ఒకరు రష్మీ గౌతమ్. వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రష్మి కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. జబర్ధస్త్ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడి జాతకమే మారిపోయింది. బుల్లితెరపైనే కాదు.. వెండి తెరపై కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.

rwsagh minజబర్ధస్త్ లోనే కాకుండా ఇతర టీవీ షోస్ లో బిజీగా ఉంటుంది. అయితే కేవలం నటిగా మాత్రమే కాదు.. రష్మి జంతు ప్రేమికురాలిగా గుర్తింపు పొందింది. కరోనా లాక్ డౌన్ సమయంలో వీధి కుక్కలకు ప్రతిరోజూ బిస్కెట్స్ పెట్టడం.. ఎక్కడైనా కుక్కలు దీనావస్థలు ఉంటే వెంటనే స్పందించడం చూస్తూనే ఉన్నాం. మనుషులకు ఆకలి వేస్తే కనీసం అడుగుతాం.. కానీ ఇలాంటి వీధుల్లో తిరిగే కుక్కల గురించి ఎవరు పట్టించుకుంటారని ఆమె కామెంట్స్ చేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్‌ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు కట్టి అది చనిపోయే వరకూ కొట్టి చంపారు. దాదాపు అరగంట సేపు ఆ కుక్క ఎంతగా అరుస్తున్నా వదలకుండా కొట్టి కొట్టి చంపారని పేర్కొంటూ ఆ వ్యక్తి రష్మిని ట్యాగ్ చేశారు.

ఈ సందర్భంగా రష్మిక ట్విట్టర్ లో స్పందిస్తూ.. అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తూ ఉండిపోయారు. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. మనకు ఈ భూమీ మీద ఉండే అర్హత లేదు అంటూ ఏడుస్తున్న ఈమోజీని యాడ్ చేసింది. ఈ ట్విట్ చూసి నెటిజన్లు సైతం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.