తన అందంతో బుల్లితెరని ఏలుతున్న స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కి.. జంతువులంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. జంతువులను హింసించవద్దు అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తుంటుంది. తన వ్యక్తిగత, కెరీర్ కి సంబంధించిన ట్వీట్స్ కంటే కూడా జంతువుల గురించి చేసే ట్వీట్సే ఎక్కువగా ఉంటాయి. కోళ్లు, మేకలు, కుక్కలు, ఆవులు వంటి వాటికి ఏమైనా అయితే తట్టుకోలేదు. అందుకే తన బాధను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే రష్మీ ఒక పోరాటమే చేస్తుంది. రీసెంట్ గా ఒక డాక్టర్ మీద కూడా ఫైర్ అయ్యింది. నీ డాక్టర్ సర్టిఫికెట్ ని చెత్తబుట్టలో పడేసేయ్ అంటూ ట్వీట్ చేసింది. తాజాగా మరో నెటిజన్ పై రష్మీ ఫైర్ అయ్యింది.
జంతువుల, పక్షుల పట్ల ప్రేమ కురిపించే రష్మీ.. వాటిని హింసించకండి అంటూ నెటిజన్స్ ని వేడుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే రష్మీ చేసే ట్వీట్స్ ని కొందరు సమర్ధిస్తే.. కొందరు మాత్రం వ్యతిరేకిస్తుంటారు. వ్యతిరేకించిన వారికి రష్మీ ఓపిగ్గా సమాధానం చెబుతూ వస్తుంది. తాజాగా ఒక నెటిజన్ కి ఓపిగ్గా సమాధానం చెప్పింది. అసలు మేటర్ లోకి వెళ్తే.. బుల్ ఫైట్ కి సంబంధించిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. ‘ఇలాంటి క్రీడలను ఎంజాయ్ చేస్తూ రాత్రి పూట ఎలా నిద్రపోతారు’ అంటూ రష్మీ ట్వీట్ చేసింది. దానికి స్పందించిన ఒక నెటిజన్.. ‘సినీ పరిశ్రమలో ఉన్న మీరు లెదర్ ఉత్పత్తులను ఎలా వాడతారు? ముందు మీరు వీటన్నిటినీ నిషేధించండి. ఆ తర్వాత ప్రతీది నిషేధించబడుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ పై రష్మీ గౌతమ్ స్పందించింది.
‘నేను సినీ పరిశ్రమ నుంచే వచ్చాను. లెదర్ ఉత్పత్తులు వాడను. ఏ రంగంలో అయినా జంతువుల తోలుతో చేసిన ఉత్పత్తులను కొనడం గానీ, వాడడం గానీ చేయకండి. మన దేశంలో లెదర్ అనేది ఎక్కువగా వయోజన ఆవుల నుంచి కూడా వస్తుంది. హిందువునైన నేను అలాంటి క్రూరమైన పని ఎప్పటికీ చేయను’ అంటూ నెటిజన్ కి రిప్లై ఇచ్చింది. ‘అధికంగా వినియోగదారులు ఉండే ఏ వస్తువునైనా మీరు నిషేధించలేరు. ఇదంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది సర్వసాధారణం. నిషేధించడం, దాన్ని మరింత హైలైట్ చేయడం కంటే లెదర్ ని కొనుగోలు చేయకుండా ఉండడమే మంచిది’ అంటూ రష్మీ ట్వీట్ చేసింది. రష్మీ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. మరి జంతువుల చర్మంతో చేసిన తోలు ఉత్పత్తులను వాడకండి అంటూ వేడుకుంటున్న రష్మీతో మీరు ఏకీభవిస్తారా? లేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
How do people who enjoy sports like these sleep in the night https://t.co/UzyEqjJg8u
— rashmi gautam (@rashmigautam27) January 30, 2023
I’m from the industry and I don’t use or buy leather
So pls discourage the practice of using or buying leather be it any industry
Also leather in India mostly comes from adult cows so being a Hindu i can never be part of such brutality https://t.co/JP2B0k1zn9— rashmi gautam (@rashmigautam27) January 31, 2023
And you can’t ban anything until it has mass consumers
It’s all about demand and supply
It’s as basic as that
T
Rather than banning and making it even more exclusive
Dont buy leather https://t.co/JP2B0k1zn9— rashmi gautam (@rashmigautam27) January 31, 2023