మా అమ్మని తిడతారా అంటూ ఉత్తేజ్ కన్నీరు!

Uttej Emotional Comments at MAA Elections Speech - Suman TV

“మా” ఎన్నికలు ముగిసినా.., “మా” లో వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇక మంచు విష్ణు విజయం తరువాత రాజీనామాలా పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు విష్ణు ఎవరి రాజీనామాలు ఆమోదించను అందర్నీ కలుపుకుని పోతాను అంటూ చెప్తున్నా, పరిస్థితిల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం మరోసారి మీడియా ముందుకి వచ్చింది. తమ ప్యానెల్ లో గెలిచిన 11 మంది మెంబర్స్ ఆయా పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ రెండేళ్ల కాలంలో విష్ణు పనికి ఎలాంటి అడ్డు ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకాశ్ రాజ్ తెలియ చేశారు. అయితే.., ఈ సందర్భంగా సీనియర్ యాక్టర్ ఉత్తేజ్ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

“మా” లో నరేశ్ ప్రవర్తన బాగుండటం లేదు. ఎన్నికల జరిగిన రోజు నరేష్ అమ్మల పై బూతులు తిట్టారు. మా ఆఫీసులోకి ప్రవేశించాలంటే.. ఈసీ మెంబర్స్ అయిన మేము థంబ్ ఇంప్రెషన్ వేయాల్సిన పరిస్థితి ఏంటి? సీసీసీ ద్వారా ఎన్నో వేల కుటుంబాలను ఆదుకున్న చిరంజీవి గారు పాల్గొన్న కారక్రమానికి సంబంధించిన లెక్కల్లో తప్పులు ఉన్నాయి అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది?

Uttej Emotional Comments at MAA Elections Speech - Suman TVమాకి సొంత బిల్డింగ్ కోసం మేము నాటకాలు ఆడిస్తే.. అక్కడ కూడా నరేశ్ తన అధికార దర్పాన్ని చూపించాడు. ఎన్నికల రోజు నా మొహంలో మొహం పెట్టి.. ఒక్కో ల*జా కొడుకు పని చెప్తా అంటూ నరేశ్ సవాలు చేశారు. ఇలాంటి మనిషి ఉన్న చోట ఎలా పని చేస్తాము? అందుకే మేమంతా రాజీనామా చేస్తున్నాము అంటూ ఉత్తేజ్ కన్నీరు పెట్టుకున్నారు. మరి.. ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.