బిగ్ బాస్ హౌజ్ లో దమ్ముకొడుతున్న భామలు..!

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 5 సందడి మొన్నటి ఆదివారంతో మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన బిగ్ బాస్ 5 ఈసారి ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే 19 మంది కంటెస్టెంట్లు ఫుల్ జోష్ తో బిగ్ బాస్ 5 మొదలైంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఆడాళ్ల జోరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు
స్విమ్మింగ్ పూల్, జిమ్, స్మాకింగ్ రూమ్ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారన్న విషయం తెలిసిందే.

biggboss1 compressed 3బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన తర్వాతి రోజు నుంచే సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. ఈ ఐదో సీజన్‌లో మాత్రం లేడీ కంటెస్టెంట్లు మహా ముదరుగా ఉన్నారు. ఒకరిని మించి మరొకరు అనేట్టుగా ఉన్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుంటున్నట్లు వారి చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. లోబో ఇంట్లో ఎప్పుడు సరదాగా ఉంటాడో.. ఎప్పుడు సీరియస్ అవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక బిగ్ బాస్ లో లోబోకు సరయుతో దోస్తీ కుదిరింది. వీరిని స్మోకింగ్ జోన్ దగ్గర చేసిందని చెప్పుకోవాలి. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ బ్యూటీలు హమీద, సరయులు లోబోతో కలిసి దమ్ము కొట్టడం కనిపించింది. గత సీజన్లలో తనీష్, ముమైత్ ఖాన్ తదితరులు స్మోకింగ్ జోన్లో చాలా బిజీగా గడిపారు. ఈ సీజన్లో లోబో, సరయు, హమీదాలు దమ్ము కొడుతూ కనిపించారు. ఎంచక్కా ముగ్గురు పిచ్చాపాటిగా కబుర్లు చెప్పేసుకున్నారు. దమ్ముకొడుతూ అలా గాల్లో పొగలు ఊదేశారు.

biggboss3 compressedఈ సందర్భంగా వారు హౌస్‌మేట్స్ గురించి మాట్లాడుకున్నారు. లోబోతో సరయు మాట్లాడుతూ.. ‘‘నీతో సరైన బాండింగ్ లేదు. బయట కనెక్ట్ అవుతాం. విశ్వ చాలా తొందరగా కనెక్ట్ అయ్యాడు’’ అని అంది. లోబో మాట్లాడుతూ.. ‘‘మీతో మజాక్ చేస్తున్నట్లు ఆ సీనియర్ నటి ప్రియాతో చేయలేను’’ అని అంటే.. హమీదా.. ‘‘ఆమె కలవదు కూడా..’’ అని పేర్కొంది. అసలే ముగ్గురం ఉన్నాం.. సరిపోతాయో లేవో అని ముందు జాగ్రత్త పడ్డారు సరయు, హమీద. ‘బిగ్ బాస్’ అన్ సీన్‌లో దీన్ని టెలికాస్ట్ చేశారు. మొత్తానికి ఈ ఇద్దరు భామల కథ వేరేలా ఉంది. ఈ ఇద్దరిని జనాలు ఏ కోణంలో చూస్తారో ముందు ముందు చూడాల్సిందే.