పుష్ప మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. శ్రీవల్లిగా అదిరిపోయిన ముద్దుగుమ్మ

puspha rashmika new poster

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ముత్తమ్ శెట్టి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్స్, సాంగ్  ప్రేక్షకులును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే మూవీ యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ రష్మిక మందన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో అచ్చమైన పల్లెదనంతో కూడిన రష్మిక లుక్స్ అదిరిపోయింది. ఇక ఈ మూవీలో రష్మిక పాత్ర పేరు శ్రీవల్లి అని మూవీ యూనిట్ తెలియజేసింది. తాజాగా విడుదల రష్మిక ఫస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక శ్రీవల్లిగా రాణించనున్న రష్మిక ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.