నేను చావాలనే మీ కోరిక తీరాలి: రామ్‌గోపాల్‌ వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలతో, వెరైటీ మాటలతో సెన్సెషన్‌ క్రియేట్‌ చేసే ఆర్జీవీ.. తాజాగా సంక్రాంతి సందర్భాంగా విచిత్రమైన ట్వీట్‌ చేశారు. సాధారణంగా దేవుడ్ని నమ్మని రామ్‌గోపాల్‌ వర్మ పండుగలను కూడా జరుపుకోరు అన్న విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఆ శుభాకాంక్షలు కేవలం ఆయనను అసహించుకునే వారికే. పైగా తన హేటర్స్‌ కోరుకుంటున్నట్లుగా తన చావు సాధ్యమైనంత తొందరగా జరగాలని, దానికి దేవుడు కూడా అనుగ్రహించాలని ఆర్జీవీ కోరుకున్నారు.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన ట్వీట్‌తో ఆర్జీవీ వార్తల్లో నిలుస్తుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరలపై ఆయన స్పందించిన తీరుపై మాత్రం సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ విషయంలో ఆర్జీవీ చాలా బాగా స్పందించారనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఆర్జీవీ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.