జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మన మూలాలను మర్చిపోవద్దు.. మనకు సాయం చేసిన వాళ్లను జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపారు కీరవాణి. ఇక ఆయన చేసిన కామెంట్స్‌పై ఆర్జీవీ రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో.. ఆయన పేరు అంతర్జాతీయంగా మారు మోగింది. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలో గేయ రచయిత చంద్రబోస్‌తో కలిసి ఆస్కార్స్ మీద ఈ అవార్డును అందుకున్నారు.
ఆస్కార్ వేడుక ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన కీరవాణి.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కీరవాణి. ఆయన మాటలు విన్న ఆర్జీవీ.. ఇక నేను చనిపోయినట్లే అని కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి కీరవాణి.. ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నాటు నాటుకు అందుకున్న ఆస్కార్.. తనకు తొలి ఆస్కార్ అవార్డు కాదని.. ఆర్జీవీ రూపంలో ముందే తనకు ఆస్కార్ వచ్చింది అన్నాడు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ..‘‘నేను సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో.. నా ట్యూన్స్‌కు సంబంధించి సుమారు 50 మందికి క్యాసెట్లు ఇచ్చాను. కొందరు వాటిని చెత్త బుట్టలో పడేసి ఉండ వచ్చు. కానీ నా ట్యూన్స్ విని రామ్ గోపాల్ వర్మ నాకు అవకాశం ఇచ్చాడు. అంతకు ముందు నేను మూడు సినిమాలకు సంగీతం అందించాను. కానీ వర్మ సినిమాతోనే నేను తొలి విజయం అందుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘క్షణ క్షణం’ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నేను మూడు సినిమాలకు సంగీతం అందించినా పెద్దగా గుర్తింపు రాలేదు. నాలుగో సినిమా ‘క్షణ క్షణం’ చేసి మంచి హిట్ అందుకున్నాను. అప్పటికే రామ్ గోపాల్ వర్మ.. ‘శివ’ రామ్ గోపాల్ వర్మగా పేరు పొందారు. ఆర్జీవీకి శివ అనేది ఆస్కార్ అయితే.. నాకు రామ్ గోపాల్ వర్మ ఆస్కార్. తనే నాకు దక్కిన మొదటి ఆస్కార్. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వచ్చిన ఆస్కార్ నాకు సెకండ్ ఆస్కార్. తన వల్లే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ రోజు నేను ఆస్కార్ స్టేజీ మీద నిల్చుని అవార్డ్ అందుకున్నానంటే అందుకు కారణం తనే’’ అంటూ ఆర్జీవీపై కీరవాణి ప్రశంసల వర్షం కురిపించారు.
ఆర్జీవీపై కీరవాణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో ఈ వీడియోపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. కీరవాణి తన గురించి మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ..“కీరవాణి, నేను చనిపోయినట్లు ఫీలవుతున్నాను. ఎందుకంటే, చనిపోయిన వారినే ఇలా పొగుడుతారు” అనే క్యాప్షన్ పెట్టారు. దానికి ఏడుస్తున్నట్లు ఉన్న ఎమోజీలను యాడ్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిసుతన్నారు. వర్మ వల్ల చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన వర్మను కీరవాణి ఇప్పటికీ గుర్తుంచుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనం అంటూ ఇద్దరి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్జీవీపై కీరవాణి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hey @mmkeeravaani I am feeling dead because only dead people are praised like this 😢😩😫 pic.twitter.com/u8c9X8kKQk
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2023