డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. కానీ వరసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎందుకంటే మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతుందనుకున్న ‘ఆదిపురుష్’.. ఏకంగా ఆరునెలల వాయిదా పడిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. దీంతో ఇప్పట్లో ప్రభాస్ ని స్క్రీన్ పై చూడటం జరిగే పనికాదు. అలా అని అభిమానులు ఊరుకోవడం లేదు. పాత సినిమాలని రీ రిలీజులు చూస్తూ ఆనందపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఒకప్పుడు స్టార్, ఇప్పుడు మాత్రం ఇలా అయిపోయాడేంటి అని మాట్లాడుకుంటారు. ఎందుకంటే డైరెక్షన్ లైట్ తీసుకుని.. సినిమాకు సంబంధించిన మిగతా విషయాలపై దృష్టి పెట్టాడు. వాయిస్ ఓవర్స్ చెప్పడం, పాటలు పాడటం, రాయడం చేస్తున్నారు. ఆ మధ్యన ‘కోబ్రా’ చిత్రంలో డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. దీనితో పాటు పలు సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ వచ్చాడు. మాగ్జిమం తన సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వచ్చిన వర్మ.. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో తీస్తున్న ‘ప్రాజెక్టు k’ కోసమే వర్మని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆయన చిన్న గెస్ట్ రోల్ లో కనిపించనున్నారట. ఇది ఆర్జీవీ రియల్ లైఫ్ పాత్రనే అని, త్వరలో షూటింగ్ కూడా పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే ఫిక్స్ చేసి పెట్టారు నిర్మాత అశ్వనీదత్. వచ్చే ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 18న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే జూన్ లో ‘ఆదిపురుష్’, సెప్టెంబరులో ‘సలార్’, అక్టోబరులో ‘ప్రాజెక్టు k’ రిలీజ్ కానున్నాయి. ఇవి ఇలానే ఉంటాయా లేదంటే మారతాయా అనేది చూడాలి. మరి ప్రభాస్ సినిమాలో వర్మ నటించనున్నాడనే విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.