ఆ హీరోతో ప్రేమలో ఉన్నా: రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు ఇండస్ట్రీలో ‘కెరటం’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రం పెద్దగా పేరు తీసుకురాలేదు.. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో రకూల్ కి మంచి పేరు రావడమే కాదు.. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. తర్వాత ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల కాలంలో రకూల్ కి పెద్దగా ఛాన్సులు రావడం లేదు.. దాంతో ఈ అమ్మడు బిజినెస్ పై దృష్టి సారించిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్.

ahgh minఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగ తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నాని తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది రకుల్ ప్రీత్ సింగ్. 2009లో విడుదలైన ‘కల్ కిసనే దేకా’ అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘రంగ్రేజ్’అనే సినిమాలో నటించాడు. ఫాల్తు, అజబ్ గజబ్ లవ్, యంగిస్థాన్, వెల్ కమ్ టు కరాచీ తదితర చిత్రాల్లో నటించాడు. కొన్ని మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించాడు.

gase min 2సరబ్ జీత్, వెల్ కమ్ టు కరాచీ, కూలీ నెం-1, బెల్ బాటమ్ తదితర చిత్రాలకు నిర్మాతంగా వ్యవహరించాడు. రకూల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని ఉద్దేశించి ఇలా రాసింది.. ‘థ్యాంక్యూ మై లవ్.. ఈ ఏడాది అందుకున్న అతి పెద్ద బహుమతి నువ్వే.. నా జీవితంలో రంగులు నింపి.. నన్ను నిరంతరం సంతోష పెడుతున్నందుకు ధన్యవాదాలు..’అంటూ ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. రకుల్‌ త్వరలోనే జాకీని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే తమ రిలేషన్‌షిప్‌ ఆఫీషియల్‌ చేసిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani)