ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగాడు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభాస్ కు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాధేశ్యామ్ మూవీని రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. కరోనా దెబ్బకి ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
image 0 compressed 61ఈ మధ్య రాధాకృష్ణ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ప్రభాస్ ఫ్యాన్స్. మూవీ అప్ డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అటు మూవీ మేకర్స్ ను, ఇటు దర్శకుడిని ట్విట్టర్ వేదికగా కామెట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానికి రాధేశ్యామ్ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది చదవండి : టీమిండియా క్రికెటర్లను ఊపేస్తున్న అల్లుఅర్జున్‌ ‘పుష్ప’ ఫీవర్‌

image 2 compressed 30వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రభాస్ అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. “మీపై మీమ్స్ ను చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి..? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..అవే నా స్ట్రెస్ బస్టర్స్” అని వెల్లడించారు. “మీరు ప్రభాస్ ని ఏమని పిలుస్తారని” మరో నెటిజన్ ప్రశ్నించగా.. “సార్” అని చెప్పాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమాని ఒకరు.. “హలో అన్నా.. నాకు రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా”.. అని బెదిరించగా.. ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా.. అంటూ స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు. రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్ కు ప్రభాస్ అభిమానులకు మధ్య జరిగిన ఈ ఫన్నీ ట్విట్టర్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.