తెరపైకి పీవీ సింధు బయోపిక్.. సింధు పాత్రలో ఆ హీరోయిన్..!

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల చిత్రాలు భారీగా తెరకెక్కుతున్నాయి. గతంలో రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రలు మాత్రం సినిమాలుగా తెరక్కించేవాళ్లు. ఇక రాను రాను స్పోర్ట్స్ లో రాణించిన వారి బయోపిక్ లు కూడా తెరెక్కిస్తున్నారు. అలా టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కించేందుకు కూడా ప్రణాళికలు జరుగుతున్నట్లు వార్తలు జోరుగా సాగుతన్నాయి.

pv sindhu biopicతాజాగా భారత స్టార్ బాడ్మింటన్ పీవీ సింధు బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. గత కొన్నాళ్ల నుంచి సింధు బయెపిక్ తెరకెక్కించాలని కొందరు దర్శకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా మరోసారి ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. ఇక సింధు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించటంతో పాటు ఏకంగా సినిమా నిర్మాణ బాధ్యతలు మోయనుందట. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి మరి.