ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా దంపతులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా చిత్రంలో హీరోయిన్ గా నటించింది ప్రీతిజింటా. సరోగసి ద్వారా తను ఇద్దరు కవలలకు తల్లిని అయినట్లు పేర్కొన్నారు. తన భర్త జీన్ తో కలిసి దిగిన ఒక ఫోటో ని పోస్ట్ చేశారు ప్రీతి. తన భర్త జీన్ తో కలిసి దిగిన ఓ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఈ సంతోష కరమైన వార్తను అందరితో పాలు పంచుకుంది ప్రీతి జింటా.
‘అందరికీ హాయ్.. ఈ రోజు మీ అందరితో ఓ సంతోషకరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. మా ప్రపంచంలోకి కవల పిల్లలు వచ్చారని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఈ మంచి తరుణంలో మా హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. మా కుటుంబంలోకి జై జింటా గుడ్ ఎనఫ్, జియా జింటా గుడ్ ఎనఫ్ లకు స్వాగతం’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.
తాము ఇంత ఆనందంలో ఉండేందుకు.. సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి కూడా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి. జీన్ గుడ్ ఎనఫ్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రీతి జింటా వెండితెరకు పూర్తిగా దూరమైంది.