సాధారణముగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంటే రాయల్ గా ఉంటారు. ప్లేయర్లకు కోట్లు కుమ్మరించి వారిని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. కానీ ప్రీతి జింటా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. తమ క్రికెరర్ల కోసం ఎవ్వరు చేయని పని చేసి తన గొప్పతనాన్ని చాటుకుంది.
సాధారణముగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంటే రాయల్ గా ఉంటారు. ప్లేయర్లకు కోట్లు కుమ్మరించి వారిని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. కానీ ప్రీతి జింటా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. తమ క్రికెరర్ల కోసం ఎవ్వరు చేయని పని చేసి తన గొప్పతనాన్ని చాటుకుంది. ఫ్రాంచైజీలు అంటే ఆటగాళ్లను కొనడం మాత్రమే కాదు వారిని అన్ని విషయాల్లో ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనే పదానికి అర్ధం చెప్పింది. ప్రస్తుతం పంజాబ్ జట్టుకి ఓనర్ గా ఉంటున్న ప్రీతీ జింటా తమ క్రికెటర్లకు 120 పరోటాలు వేసిందట. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే కింద చదివేయాల్సిందే.
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా పంజాబ్ జట్టుతో ప్రయాణం ఐపీఎల్ ప్రారంభం నుంచే ఉంది. 2008 లో లేడీ ఫ్రాంచైజీగా అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ మాజీ బాలీవుడ్ సుందరి తమ క్రికెటర్ల కోసం ఒకానొక దశలో పడిన కష్టం గురించి చెప్పుకొచ్చింది. 2009 లో ఐపీఎల్ ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అక్కడ తమ క్రికెటర్లకి సరైన ఫుడ్ లేకపోవడంతో తమ పంజాబ్ ప్లేయర్లు కోసం స్వయంగా తానే 120 పరోటాలు వేశానని చెప్పింది. ఆ తర్వాత ఆలు పరోటాలు చేయడం మానేశానని తెలిపింది.
ఇక ప్రస్తుతం పంజాబ్ జట్టుకి ఓనర్ గా ఉంటున్న ప్రీతి జింటా టీమ్ ఐపీఎల్ లో పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని పంజాబ్ టీమ్ ఈ సారి ధావన్ సారథ్యంలోనైనా ట్రోఫీ గెలవాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. 8 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో నిలిచింది. ఇక ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లోకి ఎవరు ముందుకు వెళ్తారో చూడాలి. మొత్తానికి తమ క్రికెటర్ల కోసం ప్రీతీ జింటా పరోటాలు వేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.