షాకిచ్చే రీతిలో అభిమానాన్ని చాటుకున్న ప్రభాస్ ఫ్యాన్!

Rebal Star Prabhas Fans

తెలుగు చిత్ర పరిశ్రమలో మన స్టార్ హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. హీరో కోసం ప్రాణాలిచ్చే అభిమానులు కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే హీరోల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ అనేక రకాలుగా చూపిస్తుంటారు. కాగా డార్లింగ్ ప్రభాస్ కు ఉన్న అభిమానుల గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆశ్చర్యపోయేలా అభిమానాన్ని చాటుకున్నాడో ఫ్యాన్. అసలు ప్రభాస్ అభిమాని చేసిన పనేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్న ఈ అభిమాని ఏకంగా తలపై ప్రభాస్ అనే అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకుని వీరాభిమానంతో ప్రభాస్ కు షాక్ ఇచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ తన అభిమానిని పిలిపించుకుని కాసేపు ముచ్చటించారు. ఇక ఇదే కాకుండా అతనికి ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. తాజాగా ప్రభాస్ తన అభిమానికి ఇచ్చిన గిఫ్ట్ ఫోటో నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ రాధేశ్యామ్, సలార్ వంటి సినిమాలే కాకుండా మరిన్నీ సినిమాలతో కాస్త బిజీగా ఉన్నాడు.