క్రేజీ కాంబో ఫిక్స్ : “స్పిరిట్”తో వచ్చేసిన ప్రభాస్!

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియాగా తెరెకెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తీసిన ‘సాహో ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ క‌టౌట్‌కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు.

dange minరాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాను (అక్టోబర్ 7) అనౌన్స్ చేయబోతున్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ వంగా. ఈ చిత్రం తమిళ,హిందీ భాషల్లో కూడా రిమేక్ అయ్యింది.. హిందీ వెర్షన్ సందీప్ వంగానే తెరకెక్కించారు.

ఈ నేపథ్యం లోనే తాజాగా ప్రభాస్‌ 25 వ సినిమా అనౌన్స్‌ చేశారు. “స్పిరిట్‌ ” అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ ను ప్రకటించంది చిత్ర బృందం. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పాన్ ఇండియాను మించి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.