సమంత- నాగచైతన్య విడాకులు టాలీవుడ్‌లోనే కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యూట్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అని బిరుదు తెచ్చుకున్న వీళ్లు విడిపోవడం అభిమానులను కలచి వేసింది. వీళ్ల విడాకులపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా వారి బంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఎలాంటి కారణాలు లేకపోవడం.. వారి మధ్య వివాదాలు ఉన్నట్లు కూడా కనిపించకపోయేసరికి. కొందరు అనేక అనుమానాలు, ఊహాగానలు పుట్టించడం ప్రారంభించారు. ఇటీవల అలాంటి కథనాలపై సమంత స్పందించిన విషయం తెలిసిందే. వారి విడాకులపై వస్తున్న కథనాలపై సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరోసారి సామ్ స్పందించింది.
ఇలాంటి కష్ట సమయంలో తనకు తోడుగా.. అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. తనపై వస్తున్న ఆరోపణలు, కథనాలను ఖండించింది. “వ్యక్తిగతంగా నేను ఆందోళనలో ఉన్న సమయంలో అందరూ నాపై చూపిన సానుభూతి నన్ను భావోద్వేగానికి గురిచేసింది. నాపై జరిగిన ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను ఎదుర్కొనేందుకు మీ అభిమానం నాకు అండగా నిలిచింది. నాకు మరొకరితో సంబంధాలు ఉన్నాయంటూ, పిల్లలు వద్దన్నానని, అవకాశవాదిని, నాకు అబార్షన్స్ జరిగాయని చెబుతున్నారు. విడాకులు అంశం ఎంతో బాధతో కూడుకున్నది. ఈ బాధ నుండి కాలమే నాకు ఉపశమనం కలిగిస్తుంది. వ్యక్తిగతంగా నాపై దాడి జరుగుతూనే ఉంది. ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసినా.. నా పేరును దెబ్బతీయాలని చూసినా నేను గట్టిగా ఎదుర్కొంటానని మాటిస్తున్నా’ అంటూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. మరి, ఇకనైనా అలాంటి కథనాలకు బ్రేక్ పడుతుందోమే అని అభిమానులు ఆశిస్తున్నారు.