నేను సందేహించిన మాట నిజమే. కానీ.., ఇప్పుడు ఆనందంగా ఉన్నాము: నాగచైతన్య

Naga Chaithanya Emotional Comments - Suman TV

నాగ చైతన్య హీరోగా,సాయి పల్లవి హీరోయిన్ గా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం “లవ్ స్టోరి” ఇటీవల విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో డైరక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. మా సినిమా టీమ్ నుండి ప్రేక్షకులందరికి చాలా థాంక్స్. 3 ఏళ్ల నుండి కష్టపడి పని చేశాము. ఓటీటీ వద్దు అనుకుని చివరికి థియేటర్స్ లో రిలీజ్ చేసినందుకు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయంలో ఆనందంగా ఉందన్నారు

Love Story Movie Review - Suman TVఇక హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. లవ్ స్టోరీకి మొదటి రోజు నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నిటికంటే ముందు తెలుగు ప్రేక్షకులందరికి థాంక్యూ చెప్పాలి. ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని సందేహం గా ఉండేది. కానీ.., ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించి, మా భయాలన్న మొదటి రోజే తుడిచేశారు. ఏ కథని నమ్మి మేము తీసామో దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకు చాలా చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని పంచుకున్నారు నాగచైతన్య.