రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదికగా పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీరంగంలో, రాజకీయంగా పెనుదుమారాన్నే సృష్టించాయి. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా చానెల్స్‌ను, ఆన్‌లైన్ టికెట్లపై ఏపీ ప్రభుత్వాన్ని పవన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ క్రమంలోనే వైఎస్సార్‌సీసీతో ఉండే మోహన్‌బాబా కూడా దీనిపై స్పందించాలని ఆయన కోరారు. అనంతరం పవన్ వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందిస్తూ.. ‘ పవన్‌కళ్యాణ్.. నన్ను మెల్లగా లాగావు.
నువ్వు అడిగిన ప్రతిప్రశ్నకు అక్టోబర్ 10 తర్వాత సమాధానం చెప్తా’ అని ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. కాగా ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన మా ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి. మా అధ్యక్షుడిగా మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు విజయం సాధించారు. ఈ విజయం ఇచ్చిన ఆనందంలో ఉన్న మోహన్‌బాబు పవన్ వ్యాఖ్యలపై స్పందించనున్నట్లు సమాచారం. మరీ ఆయన పవన్‌పై ఎలాంటి కామెంట్లు చేస్తారో అని సినీ, రాజకీయ అభిమానులు ఎదురుచూస్తున్నారు.