కైకాల సత్యనారాయణకి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్ కి చిరంజీవి ఫోన్!

chiranjeevi kaikala satyanarayana

కైకాల సత్యనారాయణ.. తెలుగునాట ఈ మాటకి పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో 777 చిత్రాల్లో తనకి మాత్రమే సాధ్యమైన అద్భుత పాత్రలను పోషించిన ఘనత ఆయన సొంతం. కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న కైకాల గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సత్యనారాయణ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు.

తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షిణించిన విషయం తెలిసిందే. దీంతో.. అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ప్రస్తుతం కైకాల జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికలో చికిత్స అందుకుంటున్నారు.

ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే మెగాస్టార్ చిరంజీవి తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై స్పందించారు. ఈ మేరకు కైకాల ఆరోగ్యం పై చిరంజీవి ఓ ట్వీట్‌ చేయడం విశేషం. ఐసీయూలో చికిత్స అందుకుంటున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలిసింది. వెంటనే.. క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది.

ఆయన మాట్లాడలేకపోయినా, ‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి’అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్‌ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్‌ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం విశేషం.