మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం!

గత కొన్ని రోజులుగా వాడీ వేడిగా సాగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికల పోరుకి ఆదివారంతో ముగింపు పలికింది. హూరా హూరీగా సాగిన మా ఎన్నికల్లో  మంచు విష్ణు ప్ర‌కాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ మరుసటి రోజు నుంచి మా ఎన్నికల్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు మా ఎన్నికల రచ్చ నడుస్తుండగానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు.

fasgds minప్రమాణ స్వీకారం అనంతరం ఆయన వెంటనే తాను ప్రకటించిన మానిఫెస్టోలో ప్రకటించిన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో దీనిపై విష్ణు ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్. మరి కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుంది… ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల కోరిక మేరకు మొత్తం మంచు విష్ణు ప్యానెల్ సభ్యులే ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది చూడాలి. కాగా, భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు.

తాము ఎప్పటికీ విష్ణుకి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తామని.. ఆయన ఇచ్చిన హ‌మీల‌ను త‌ప్ప‌క నెర‌వేరుస్తాడని మేమదరం భావిస్తున్నాం. లేని ప‌క్షంలోత‌ప్ప‌క ప్ర‌శ్నిస్తాం అని కూడా ఆయ‌న తెలిపారు ప్రకాశ్ రాజ్. అయితే ఎన్నికల సందర్బంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదు. కానీ మంచు విష్ణు మాత్రం భారీ హామీలు ఇచ్చారు. . అనేక సంక్షేమ పథకాలను కూడా విష్ణు ప్రకటించారు.