మంచు విష్ణు ప్యానెల్ రెడీ.. సభ్యులు వీళ్లే

manchu vishnu maa elections

ఃతెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటూనే ఉంది. రేసులో నుంచి జీవిత, హేమ తప్పుకోగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహన్ ఉన్నారు. ఇక బరిలో నుంచి తప్పుకున్న వీరిద్దరూ హఠాత్తుగా ప్రకాష్ రాజ్ కు మద్దతు పలుకుతూ కాస్త షాక్ కు గురి చేశారనే చెప్పాలి. అయితే ఈ తరుణంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మెల్లగా తప్పుకున్నారు బండ్ల గణేష్. ఇక తప్పుకోవటమే కాకుండా నేను కూడా పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించారు.

దీంతో మా ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఇక విషయానికోస్తే మొదట్లోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులను ప్రకటించగా ఇక మంచు విష్ణు కూడా తాజాగా తన ప్యానెల్ సభ్యులను ప్రకటించి సమరానికి సై అంటున్నారు. ఇక అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు-మంచు విష్ణు, జనరల్ సెక్రటరీగా-రఘుబాబు,ఉపాధ్యకులు-మాదాల రవి,ప్రథ్వీరాజ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రసిడెంట్-బాబు మోహన్. ఇక అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య పోటీ రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది.