విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ నటించి మెప్పించారు. తాజాగా మంచు లక్ష్మి మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ‘మాన్ స్టర్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ‘లక్కీసింగ్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కూడా నటించనున్నారు.
‘ఎట్టకేలకు క్యాట్ బయటకు వచ్చేసింది. కొత్త భాష, కొత్త జానర్.. సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో మలయాళంలో నటిస్తోన్న నా తొలి చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను.ఈ సినిమాలో నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్న సమయం ఎప్పటికీ మరిచిపోలేనిది’ అంటూ తన మలయాళ సినిమా గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మంచు లక్ష్మి “మాన్‌స్టార్” చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేశారు. మరి టాలెండెంట్ మంచు లక్ష్మి మాలీవుడ్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.