మధ్య ప్రదేశ్ లో విద్యార్థిని ఘటనపై స్పందించారు ప్రముఖ నటి మంచు లక్ష్మి. ఈ దారుణ ఘటనపై సీరియస్ అవుతూ.. రక్తం మరుగుతోందంటూ క్యాప్షన్ పెట్టారు. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ లో ఓ స్కూల్ విద్యార్థినిపై ఓ పోలీస్ ఆఫీసర్ నడి రోడ్డుపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అయితే ఈ దారుణ చర్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై తాజాగా ప్రముఖ నటి ముంచు లక్ష్మి సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఆమె.. కాస్త సీరియస్ అయ్యారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఇటీవల ఓ రోజు రాత్రి ఓ స్కూల్ విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ ఆ విద్యార్థిని గమనించాడు. ఇక నడుచుకుంటు వెళ్తున్న ఆ బాలికను అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. బైక్ పై కూర్చుని ఆ విద్యార్థిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు దారుణంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ దారుణ ఘటనపై నటి మంచు లక్ష్మి సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రొఫేసర్ అశోక్ స్వైన్ పేరు మీద ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. రక్తం మరుగుతోందంటూ క్యాప్షన్ పెట్టారు. మంచు లక్ష్మి చేసిన ట్వీట్ పై కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ ఫైర్ అయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.
Blood boils https://t.co/StR428okW0
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 9, 2023