ఖరీదైన లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్!

సాధారణంగా సెలబ్రెటీలు, క్రికెటర్లు ఎక్కువగా లగ్జరీ కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్ లోకి ఖరీదైన కారు వస్తే చాలు వెంటనే బుక్ చేసుకోవడం చూస్తుంటాం.. అంతే కాదు అలాంటి వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కేవలం పురుషులు మాత్రమే కాకుండా, స్త్రీలు కూడా తమదైన రీతిలో లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో ప్రముఖ మలయాళీ నటి ‘మమతా మోహన్ దాస్’ ముందు ఉంటుంది.

carj min 2ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్ లోనే అగ్ర హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇచ్చిన నటిమణులలో మమతా మోహన్ దాస్ ఒకరు. మంచి పొజీషన్లోకి వస్తున్న సమయంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడింది. అనంతరం పోరాడి గెలిచింది. మమతా మోహన్ దాస్ అంటే తెలుగు ఆడియెన్స్ బాగా తెలిసిన. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’ చిత్రంలో అబ్బయా.. ఓ అబ్బయా.. అంటూ తెగ సందడి చేసింది ఈ అమ్మడు. ఎలాంటి పాత్ర చేసినా కూడా వంద శాతం న్యాయం చేసేది. మమతా మోహన్ దాస్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు అందుకుంది.

cartg3 min2011లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కు సిద్దమవుతున్న తరుణంలోనే భర్తతో విడాకులు కూడా తీసుకుంది. ఒంటరిగానే అమెరికాకు వెళ్లి చికిత్స చేసుకుని మహమ్మారిని జయించింది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తున్న మ‌మ‌తా మోహ‌న్ దాస్ తాజాగా త‌న‌కు న‌చ్చిన ‘పోర్ష్‌ 911’తో ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.84 కోట్లు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారుని మమతా మోహన్ దాస్ కాకుండా, మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ కి కూడా ఉంది.