అరుదైన గుర్తింపులో మహేష్‌ బాబు, నమ్రత క్యూట్ కపుల్స్

mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత జంట.. టాలీవుడ్ లో వీరి జంట క్యూట్ కపుల్స్ అని చెప్పొవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకుని వీరు వివాహ బంధంతో ఒక్కటై దాదాపుగా 16 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చెక్కుచెదరని ప్రేమతో కలిసిమెలిసి ఉంటారీ జంట. వీరికి ఓ కొడుకు, కూతురు కూడా జన్మించారు. నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.

అయితే వీరి జంటను చూసి అందరూ కుళ్లుకునే విధంగా జీవిస్తున్నారు. ఇలా అన్యోన్యమైన జీవితాన్ని గడిపే ఈ క్యూట్ కపుల్స్ ఓ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అదేంటంటే..? ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌ ‘హల్లో’కు మహేష్ బాబు, నమ్రత జంట కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని కోసం తాజాగా వీరిద్దరు ప్రత్యేక ఫోటో షూట్ లో పాల్గొన్నారు మహేష్ బాబు ఆయన భార్య నమ్రత. వీరు దిగిన ఫోటోలను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆ ఫోటోలను పోస్ట్ చేసిన మహేష్ బాబు.. మై సూపర్ ఉమన్ తో కలిసి హాలో మ్యాగజైన్‌ తో కలిసి మాట్లాడుకోవటం ఓ అద్భుతమంటూ ఓ క్యాప్షన్ ను జోడించారు. తాజాగా మహేష్ బాబు పోస్ట్ చేసిన వీరి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.