టీ20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా విజయంపై స్పందించిన మహేష్‌బాబు

Mahesh Babu Praising on David Warner - Suman TV

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2021 ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్‌ గెలుపుపై టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు స్పందించారు. ఆస్ట్రేలియా అదరగొట్టిందని, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ట్రోర్నీలో అదరగొట్టిన వార్నర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది ట్రోర్నీగా నిలిచాడు. ‘వార్నర్‌.. నీ గురించి ఏం చెప్పను.. సహచరుడుగా.. నువ్వు ఒక లెజెండ్‌’ అని వార్నన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సూపర్‌స్టార్‌ మహేష్‌. ఇండియా మ్యాచ్‌ ఆడే మ్యాచ్‌లను మహేష్‌ బాబు అప్పుడప్పుడు చూస్తూ.. సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడంపై మహేష్‌బాబు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో స్పందించారు.