తమిళ, తెలుగు ఇండస్ట్రీలో హీరో సూర్యకు ఎంత మంచి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తమిళంలో సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహించారు. తెలుగులో ఆకాశం నీ హద్దురా’ రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులతో పాటు వేరే భాషల్లో కూడా అమేజాన్ ప్రైమ్ లో మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రానికి అవార్డులు.. రివార్డులు వచ్చాయి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి సూర్య హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ హీరో నటించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా మొదలు పెట్టే క్రమంలో సూర్య అండ్ కోకు షాక్ తగిలింది. శిఖ్య ఎంటర్టైన్మెంట్ తమ అనుమతి లేకుండానే హిందీ రీమేక్ తీస్తున్నారంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు రీమేక్ పై స్టే విధించింది. ఇదివరకు ఇచ్చిన స్టేని రద్దు చేస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో సూర్యకి ఊరట లభించింది.