స్టార్ హీరోలు రియల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక జూనియర్ యన్టీఆర్ లాంటి ఏ1 స్టార్స్ కి ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేసే గ్యాప్ ఉండదు. పైగా.. తారక్ ఇప్పుడు హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా బిజీ అయిపోయాడు. అయితే.. తారక్ కి మూడేళ్ళ తరువాత ఇప్పుడు కాస్త ఫ్రీ టైమ్ దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని.. క్వాలిటీ అవర్స్ గా మార్చుకోవడానికి జూనియర్ ఫ్యామిలీతో కలసి విదేశాలకి చెక్కేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు తారక్ మూడేళ్ల పాటు కష్టపడ్డాడు. కరోనా అంతరాయాలు ఈ సినిమా షూటింగ్ ని బాగా ప్రభవితం చేశాయి. పాన్ ఇండియా మూవీ కావడంతో జక్కన్న సైడ్ నుండి కూడా కాస్త డిలే అయ్యింది. ఈ సమయంలోనే తారక్ హోస్ట్ గా మారి “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోని అద్భుతంగా రన్ చేశాడు. అయితే.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోయింది. “మీలో ఎవరు కోటీశ్వరుడు” షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. తన తరువాత మూవీ పాటట్లు ఎక్కడానికి కాస్త సమయం ఉంది. దీంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ కు వెకేషన్ కు వెళ్లారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ట్రిపుల్ ఆర్ తరువాత యన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. తరువాత సంజయ్ లీలా భన్సాలీతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇలా వరుసగా సినిమాలు ఉండటంతో యన్టీఆర్ ఇలా ఫ్యామిలీ టూర్ కి చెక్కేసినట్టు తెలుస్తోంది. తారక్ మళ్ళీ రిటర్న్ అయ్యాక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు.