చిక్కుల్లో “దృశ్యం-2” చిత్రం! లీగల్ యాక్షన్ కు ఓటీటీ సిద్ధం?

Drushyam 2 Legal Issue

విక్టరీ వెంకటేష్, మీనా నటించిన దృశ్యం ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో సమస్యల్లో చిక్కుకున్న తన బిడ్డలను కాపాడటానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంది. ఆ తండ్రి పాత్రలలో వేంకటేష్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆ సినిమా హిట్ తో దృశ్యం-2 చిత్రం ప్రారంభమైయింది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు తో పాటు మరి కొందరు నిర్మతాలు నిర్మిస్తుండగా, జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. దృశ్యం-2 చిత్రం టీజర్ ఇప్పటికి విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రం కోసం వెంకటేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘దృశ్యం-2’ వచ్చే వారం అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. నవంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోందని సమాచారం. దిగ్గజ ఓటిటి సంస్థ ‘దృశ్యం-2’ మేకర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టబోతోందటా. ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్స్టార్ టీమ్ ‘దృశ్యం-2 నిర్మాతల నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రాన్ని మొదట హాట్స్టార్లో విడుదల చేయాలని అనుకున్నారు, కానీ తరువాత నిర్మాతలు దానిని అమెజాన్కి మార్చారు. అయితే ఈ ఒప్పందానికి ముందు తమతో డీల్ను రద్దు చేసుకోకపోవడంతో డిస్నీ హాట్స్టార్ నిర్మాతల నిర్ణయంతో కలత చెందారట. కాబట్టి రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు భావిస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..